Share News

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:01 AM

సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డ్డి ఆరోపించారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

ఆత్మకూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డ్డి ఆరోపించారు. పట్టణంలోని గొల్లపేట అరుగు వద్ద గురువారం బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రచ్చబండ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ పథకాల పేరుతో లేనిపోని హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నేడు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అరకొర హామీలను అమలు చేస్తూ అన్ని చేశామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మోసపూరిత హమీలతో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆయన చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తప్పుడు కేసులతో వైసీపీ నాయకులను బెదిరించడం దారుణమన్నారు. ఆ పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, సయ్యద్‌మీర్‌, అంజాద్‌అలి, మారుబత్తుల విజయ కుమార్‌, మునీర్‌బాషా, సుల్తాన్‌, బాలస్వామియాదవ్‌ ఉన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:01 AM