Share News

రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:17 AM

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం
మోటారును ఆన్‌ చేసి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

జూపాడుబంగ్లా, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండలంలోని తాటిపాడు వద్ద ఉన్న జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకాన్ని శనివారం మోటారును ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ముందుగా కృష్ణమ్మకు చీర, సారె సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థుతుల వల్ల మెట్టప్రాంతంలో సాగుచేసిన వర్షాధారపంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఎగువప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు రావడంతో రైతులకు ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసుకునేందుకు అవకాశం వచ్చిందని అన్నారు. నీటిని వృథా చేయకుండా పంటలకు వినియోగించుకోవాలని అన్నారు. జూపాడుబంగ్లా-1, 2 ఎత్తిపోతల నుంచి 45 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరీశ్వరరెడ్డి, రమణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దన్న, సుధాకర్‌, రవికుమార్‌యాదవ్‌, బాలమద్దిలేటి, మాజీ సర్పంచ్‌ లక్ష్మన్నగౌడు, రాముడు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:17 AM