Share News

చెరువుల శిథిలావస్థ..

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:53 PM

మండలంలో మైనర్‌ ఇరిగేషన్‌ కింద 3 చెరువులు,మరో చిన్నపాటి చెరువులు 22 ఉన్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌ కింద కరివేమలు, నేలతలమర్రి, మాచాపురం చెరువులు ఉన్నాయి. చెరువుల్లో నీటి నిల్వతో సమీప పొలాల్లో భూగర్భ జలాలు అభివృద్ధి చెందడంతో పాటు సాగు, తాగునీరు అందుతుంది. అయితే గత ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని పట్టించుకోకపోవడండో అవి శిథిలావస్థకు చేరాయి.

చెరువుల శిథిలావస్థ..
ముళ్లపొదలతో నిండిన కరివేముల చెరువు కట్ట

మరమ్మతులు చేయాలని రైతుల వినతి

దేవనకొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో మైనర్‌ ఇరిగేషన్‌ కింద 3 చెరువులు,మరో చిన్నపాటి చెరువులు 22 ఉన్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌ కింద కరివేమలు, నేలతలమర్రి, మాచాపురం చెరువులు ఉన్నాయి. చెరువుల్లో నీటి నిల్వతో సమీప పొలాల్లో భూగర్భ జలాలు అభివృద్ధి చెందడంతో పాటు సాగు, తాగునీరు అందుతుంది. అయితే గత ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని పట్టించుకోకపోవడండో అవి శిథిలావస్థకు చేరాయి. కట్టలకు పగుళ్లు ఏర్పడ్డాయి, తూములు మూసు కుపోయి నీరు పారడం లేదు. మండలంలోని కరివేముల, దేవనకొండలోని రెండు చెరువులకి మాత్రమే హంద్రీనీవా నీరు వస్తోంది. మరమ్మతులు చేస్తే మరో ఐదు చెరువులను హంద్రీనీవా నీటి నింపుకునే ఆవకాశం ఉంటుంది.

కాలువల్లో పూడిక..

చెరువు నుంచి పొలాలకు వెళ్లే కాలువలో పూడిక తీయకపోవడంతో నీరు అందడం లేదు. కాలువలకు మరమ్మతులు చేసి నీరు పారేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

మరమ్మతులు చేయాలి

ఐదేళ్లుగా మరమ్మతులు చేయక పోవడంతో గట్లు, తూములు దెబ్బతిన్నాయి. ముళ్ల పెరిగి పోయింది. కాలువలు కూడా పూడి కతో నిండాయి. నీరు అందడం లేదు. అధికారులు స్పందించి మర్మమతులు చేయించాలి. - అబ్బా రంగన్న ,కరివేముల

మరమ్మత్తులకు ప్రతిపాదనలు

మండలంలో 12 చెరువుల మరమ్మతులకు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులు నిర్వహిస్తాం.- సోమన్న, ఏఈఈ, దేవనకొండ.

Updated Date - Feb 26 , 2025 | 11:53 PM