‘2.0 విధానాన్ని రద్దు చేయాలి’
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:56 AM
రిజిస్ర్టేషన్ ప్రక్రియలో ఉపయోగించే 2.0 విధానాన్ని రద్దు చేయాలని స్టాంప్స్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేశ్ డిమాండు చేశారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్ ప్రక్రియలో ఉపయోగించే 2.0 విధానాన్ని రద్దు చేయాలని స్టాంప్స్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేశ్ డిమాండు చేశారు. గురువారం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ధర్నా చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవ్‌రావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.