‘ఉగ్రవాదుల దాడి అమానుషం’
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:30 AM
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉదగ్రవాదుల దాడి అమానుషమని బీజేపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నంద్యాల కల్చరల్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉదగ్రవాదుల దాడి అమానుషమని బీజేపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఇనుగూరి రమేష్‌బాబు, కశెట్టి చంద్రశేఖర్, గోస్పాడు మండల అధ్యక్షుడు మధుగోపాల్, నాయకులు బెక్కం నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎర్రమల బాలముని, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటన బాధాకరమని శ్రీశైలం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ మోమిన్ షబాన, టీడీపీ ఆత్మకూరు పట్టణాధ్యక్షుడఉ వేణుగోపాల్ అన్నారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ స్థానిక బీజేపీ కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళి అర్పించారు.
కశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడం అమానుషమైన ఘటన అని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుసేన్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులను ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చాడం బాధాకర మని, ఇది మానవత్వానికే మాయని మచ్చ అని అన్నారు. ఉగ్రదాడి క్షమించరానిదని, ఎవరూ ఇలాంటి ఘటనలను ఆక్షేపించరని అన్నారు.
బండిఆత్మకూరు: కశ్మీర్‌లో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వదలి పెట్టవద్దని మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్ ఆర్మీలో పనిచేస్తున్న మహబూబ్‌బాషా అన్నారు. బుధవార రాత్రి మండలంలోని పెద్దదేవళాపురం గ్రామంలో ప్రజలతో కలిసి ఆయన ర్యాలీ చేపట్టారు. ముందుగా మృతులకు నివాళ్ళు అర్పించారు.
నంద్యాల కల్చరల్: ప్రశాంతంగా వున్న కాశ్మీర్‌లో పర్యాటకులపై తీవ్రవాదులు దాడి చేసి మతం చూసి కాల్చి చంపిన సంఘటనతో దేశమంతా దిగ్ర్భాంతి చెందింది. ఈ సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు విశఽ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ గురువారం సాయంత్రం 5గంటలకు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుంచి నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొషోర్, సహకార్యదర్శి నాగరాజు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చిలుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల రూరల్: కశ్మీర్‌లో భారత యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషం అని సీపీఐ నాయకులు రంగనాయుడు, బాబాఫకృద్దీన్ అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంటటి వారెనఆ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
కశ్మీర్‌లో జరిగి దాడికి హిందూ, ముస్లీం, మైనార్టీ , క్రిష్టియన్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉగ్రవాదం, మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని అరు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అదుకోవాలని, దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రజా సంఘాల నాయకులు బెన్ హిన్ పుటికేలా, సత్యనారాయణ, శివరామిరెడ్డి, అబ్దుల్ మజీద్ పలువురు పాల్గొన్నారు.