Share News

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ABN , Publish Date - May 24 , 2025 | 11:57 PM

నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పుర స్కారాలు అందజేశారు.

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
విద్యార్థినికి పురస్కారం అందజేస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పుర స్కారాలు అందజేశారు. మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షులు సుబ్బన్న, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ల ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈకార్యక్రమానికి డీఈవో జనార్దన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు చింతామణి, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి లక్కభూషణం, ఎస్పీజీ హైస్కూల్‌ ఎచ్‌ఎం జీవలత, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ ముఖ్యఅతిఽథిగా హాజరై 30మంది విద్యార్థులకు పురస్కా రాలు అందజేసి అభినందించారు. వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్య ద్వారానే విలువ లభిస్తుందని, వివేకాన్ని పెంచుతుందన్నారు. విద్య వల్ల కులమతాలకు అతీతంగా గౌరవాన్ని పొందవచ్చన్నారు. విద్యార్థులు తమ లక్ష్యసాధనకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు నడవాలన్నారు. ఓటమి చెందినప్పుడు కుంగిపోకుండా మానసిక స్థైర్యంతో ముందుకు సాగలన్నారు. కార్యక్రమంలో సుజిత్‌ ఆనంద్‌సు కుమార్‌, మద్దయ్య, వెంకటేశ్వర్లు, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:57 PM