Share News

వెనక్కి తీసుకెళ్లండి..

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:31 AM

కందులను కొనుగోలు చేసిన అనంతరం అవి బాగలేవని వెనక్కి తీసుకెళ్లాలని సూచించడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

వెనక్కి తీసుకెళ్లండి..
కందులు.

గత నెలలో కందులను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్‌ అధికారులు

నేడు నాణ్యంగా లేవని, రైతులో ఆలూరుకు వెళ్లి తెచ్చుకోవాలని హుకుం

మద్దికెర, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దికెర, బురుజుల, పెరవలి, హంపా గ్రామాల్లో మార్క్‌ఫెడ్‌ వారు కందులను కొనుగోలు చేశారు. క్వింటం రూ.7,750ల ప్రకారం పెరవలిలో 1,500, హంపాలో 350, బురుజులలో 350, మద్దికెరలో 1000 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. మార్క్‌పెడ్‌ వారు క్వాలిటీ కంట్రోల్‌ అధికా రులతో కందులను ఒకటి రెండుసార్లు పరిశీలించి అనంతరమే కొనుగోలు చేశారు.

వెనక్కు పంపిన గోదాము అధికారులు

రైతుల వద్ద కొనుగోలు చేసిన ఈ కందులను ఆలూరు గోదాములకు పంపారు. అయితే అక్కడ వీటిని పరిశీలించిన అధికారులు మద్దికెర మండలం నుంచి 140 క్వింటాళ్లు బాగా లేవని వెనక్కి తీసుకె ళ్లాలని సూచించారు. ఒక్కొక్క రైతుకు 5, 10, 20, 29 క్వింటాళ్లు మొత్తం 9మంది రైతులకు చెందిన కందులు బాగాలేవని తిరిగి తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు.

రైతులకు రవాణా ఖర్చులు

ఆలూరు నుంచి తిరిగి కందులను తీసుకు రావాలంటే రవాణా ఖర్చులు భరించాలంటే తలకు మించిన భారమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే కందులను తెచ్చివ్వాలని కోరుతున్నారు.

ఫ ఈ విషయంపై మార్క్‌ఫెడ్‌ కొనుగోలు అధికారి రామకృష్ణ మాట్లాడుతూ దాదాపు 2వేల క్వింటాళ్లు పంపామని, కొన్ని క్వింటాళ్లు మాత్రమే వెనక్కు వచ్చాయనీ, ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులే ఆలూరుకు వెళ్లి తెచ్చుకోవాలని తామేం చేయలేమని వివరణ ఇచ్చారు.

రవాణా చార్జీలు ఎవరిస్తారు?

కందులను మార్క్‌ఫెడ్‌ వారికి విక్రయించాం. అయి తే వాటిలో 29 ప్యాకెట్లు నాణ్యంగా లేవంటున్నారు. ఆలూరుకు వెళ్లి తెచ్చుకో వాలంటే రవాణ చార్జీలు ఎవరు ఇస్తారు. - వెంకటేశ్వరరెడ్డి

Updated Date - Feb 26 , 2025 | 12:34 AM