అందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:27 PM
అందరి సహకారంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు.

కోవెలకుంట్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : అందరి సహకారంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. శనివారం కోవెలకుంట్ల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ -స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా రాష్ట్రమంత్రి బీసీ జనార్దనరెడ్డి హాజరై ప్రారంభించారు. ముందుగా కోవెలకుంట్ల చేరుకున్న మంత్రికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పాండురంగ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న చెత్తను స్వయంగా ఎత్తి తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాండురంగ దేవాలయం నుండి సంత మార్కెట్ మీదుగా గ్రామ పంచాయతీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్కిల్ కూడలిలో మానవహారంగా ఏర్పడి నాయకులతో కలిసి మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ నెలలో మూడో శనివారం స్వచ్ఛాంఽధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములలై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మంత్రి అందరి చేత ప్రమాణం చేయించారు. అక్కడ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం చేరుకుని టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. స్థలం లేని వారికి నిరుపేదలకు స్థలం, ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, బీవీ ప్రసాదరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, గువ్వల సుబ్బారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గడ్డం రామక్రిష్ణరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్‌ఏ గఫూర్, శ్రీధర్‌రెడ్డి, ధనుంజయుడు, అర్జున్‌రెడ్డి, గుల్లదుర్తి సుదర్శన్‌రెడ్డి, వల్లంపాటి సర్పంచ్ జగదీశ్వర్‌రెడ్డి, బాలరాజు, బుచ్చన్న, గజ్జల హుసేనయ్య, డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఓ. రాంభూపాల్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సోమశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.