Share News

పేదల ఇంటి నిర్మాణానికి సహకారం: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:52 AM

జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ నుంచి గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు.

పేదల ఇంటి నిర్మాణానికి సహకారం: కలెక్టర్‌
సమీక్షిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ నుంచి గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న ప్రస్తుత యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున సాయం అందజేయనున్నట్లు తెలిపారు. హౌసింగ్‌ ఈఈ హరిహర గోపాల్‌, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

‘లక్ష్యాన్ని అధిగమించాలి’

జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న 9లక్షల వేతనదారుల బడ్జెట్‌లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆమె మాట్లాడుతూ 80నుంచి 90రోజుల పనిదినాలకు చేరువలో ఉన్న కుటుంబాలను గుర్తించి వంద రోజులు పనిదినాలు పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆళ్లగడ్డ, బండిఆత్మకూరు, చాగలమర్రి, కొత్తపల్లె, రుద్రవరం, అవుకు తదితర 9మండలాలు లేబర్‌ బడ్జెట్‌లోవెనుకబడిఉన్నాయని, వెంటనే ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వందరోజుల పనిదినాల లక్ష్యంలో జిల్లా 13వ స్థానంలో ఉందన్నారు. డోన్‌ మండలంలో అన్ని పారామీటర్లలో వెనుకబడి ఉన్నారని, పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. పశువుల షెడ్ల నిర్మాణానికి సంబంధించి 62శాతమే పూర్తిచేశారని మిగిలిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

Updated Date - Mar 12 , 2025 | 12:53 AM