Share News

చెరుకు పంట దగ్ధం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:27 AM

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చెరుకు పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మాధవరం గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

చెరుకు పంట దగ్ధం
దగ్ధమైన పంటను చూపుతున్న బాధితుడు

మంత్రాలయం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చెరుకు పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మాధవరం గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాధవరం తుంగభద్ర నది బ్రిడ్జి సమీపంలో కురువ గుడిసె నాగుడు అనే రైతు ఎకరా పొలం కౌలుకు తీసుకొని చెరకు పంట సాగు చేశాడు. అక్కడే రోడ్డుపక్కన చెరుకు మిషన్‌ ఏర్పాటు చేసుకుని వచ్చి వెళ్తున్న ప్రయాణికులను చెరుకు రసం విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. అయితే మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చెరకు దగ్ధం కావడం గమనించి లబోదిబోమంటూ కేకలు వేస్తూ చుట్టుపక్కవారిని పిలిచి నీరు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే మంటలు వ్యాపించి చెరుకు పంటంతా కాలిబూడిందైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎమ్మిగనూరు అగ్నిమాపక కేంద్రం ఎస్‌ఐ వెంకటేశ్‌, సర్దార్‌ బాషా, ఆంజినేయ రమే్‌ష వచ్చి ఇతర పంటలకు మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు. దాదాపు రూ. ఐదు లక్షల నష్టం వాటిల్లిందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. చేతికి వచ్చిన పంట అగ్నికి ఆహుతైందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

కొత్తపల్లి వరిగడ్డికి నిప్పు..

కొత్తపల్లి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లిలో మంగళవారం ప్రమాదవశాత్తు ఆరు వరిగడ్డి వాములు దగ్ధమ య్యాయి. గ్రామానికి చెందిన పాతకోట వెంకటరమణకు చెందిన మూడు గడ్డివాములు, మల్లయ్యకు చెందిన మూడు గడ్డివాములు మంటలకు కాలిపోయాయి. బాధితులు మాట్లాడుతూ మూగజీవాలకు వరిగడ్డి లేకపోవ డంతో ఇతర ప్రాంతాల నుంచి సుమారు 30 బండ్ల వరిగడ్డిని కొనుగోలు చేసి గడ్డివాములను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. కొందరు ఆకతాయిలు సిగరెట్‌, బీడి తాగి పడేయడం వల్లనే మంట రాజేసుకుని గడ్డివాములు దగ్ధమై ఉంటాయని అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలను అదుపులోకి తేవడంతో సమీపంలో ఉన్న గడ్డివాములకు ప్రమాదం తప్పడం వల్ల రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు.

Updated Date - Feb 26 , 2025 | 12:27 AM