Share News

సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:48 AM

సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సిరి చెప్పారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్‌
చింతకుంటలో ఉల్లిపంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి

కోసిగి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సిరి చెప్పారు. కోసిగితో పాటు చింతకుంట గ్రామంలో కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన చేపట్టారు. చింతకుంట గ్రామంలో పారిశుధ్యం లోపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం కోసిగి సచివాలయం-4లో తనిఖీ చేసి సచివాలయంలో రికార్డులు పరిశీలించారు. కోసిగిలోని జగనన్న కాలనీలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ను ఆదేశించారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని కోసిగిలో 9వ వార్డులోని కమ్మరిగేరి కాలనీ మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ తిమ్మరాజు, పంచాయతీ కార్యదర్శిని పిలిచి వారి నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. చింతకుంటలో ఉల్లిపంటను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం, పంట బీమా నగదు వారి అకౌంటులో జమ చేయాలని కోసిగి చెందిన ఆదర్శ రైతు సీపీ వీరన్న కలెక్టర్‌కు విన్నవించారు. కోసిగిలోని ఉరుకుందకు వెళ్లే రైల్వేగేటు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కోసిగిలో రైల్వేఫ్లైఓవర్‌ నిర్మించాలని స్థానికులు కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్‌ స్పందించి రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ చిరంజీవి, డీపీవో భాస్కర్‌, కోసిగి తహసీల్దార్‌ వేణుగోపాల్‌ శర్మ, ఎంపీడీవో మహబూబ్‌ బాషా, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ తిమ్మరాజు, హౌసింగ్‌ డిప్యూటీ ఇంజనీర్‌ లాల్‌స్వామి, ఏఈ స్వరూప్‌, ఏఎ్‌సఐ నాగరాజు పాల్గొన్నారు.

మంత్రాలయం: మంత్రాలయంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం రామచంద్ర నగర్‌లో సర్పంచ్‌ భీమయ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, పరిశుభ్రత, రోడ్లు ఊడ్చడం వంటివి అడిగి తెలుసుకున్నారు. అండర్‌ డ్రైనేజీ, నాగలదిన్నె రోడ్‌లో నల్లవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మిగనూరు రోడ్డులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డితో కలిసి ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌ కాలనీలో పర్యటించి అక్కడ నివాసం ఉన్న వారితో మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ దీపాలు, తాగునీరు లేవని చెప్పడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డ్రాపౌట్స్‌ కాకుండా చూడాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై ఉందని ఎంఈవోలు మైనుద్దీన్‌, రాగన్నను ఆదేశిం చారు. డీపీవో భాస్కర్‌, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, డీఈ లాల్‌కృష్ణయ్య, తహసీల్దారు రమాదేవి, ఎంపీడీవో నూర్జహాన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకట్రాముడు, డిప్యూటీ ఎంపీడీవో రామాంజ నేయులు, ఏఈలు మల్లయ్య, ఆర్‌ఐ జనార్దన్‌ రావు, ఆర్డీవో ఏవో వసుంధర, ఉపేంద్రరెడ్డి, టీడీపీ నాయకులు రాకేశ్‌రెడ్డి, వరదరాజు, సొసైటీ డైరెక్టర్లు నాగేష్‌, లక్ష్మన్న, రాఘవేంద్ర, ఎంపీటీసీ వెంకటేశ్‌, ఎల్‌ఎల్‌సీ చైర్మన్‌ నరసింహులు, పవన్‌కుమార్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:48 AM