మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:36 AM
మత్తు పదార్థాల దూరంగా ఉండాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి రాహుల్ అంబేడ్కర్ సూచించారు.

ఆత్మకూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల దూరంగా ఉండాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి రాహుల్ అంబేడ్కర్ సూచించారు. జూన్ 26న డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిం చిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి శుక్ర వారం బహుమతులు ప్రదానం చేశారు. హెచ్‌ఎం ఉమారాణి ఉన్నారు.