Share News

ముగిసిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:45 AM

స్థానిక డీఎస్‌ఏ అవుట్‌ డోర్‌ స్టేడియంలో కర్నూలు జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన ఆధ్వర్యం లో గత రెండు రోజులుగా జరుగుతున్న పదో రాష్ట్ర స్థాయి సీనియర్‌ మహిళలు, జూనియర్‌ బాలుర విభాగం పోటీలు ఆదివారంతో ముగిశాయి.

ముగిసిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు
విజేత కర్నూలు బాలురు జట్టుకు కప్పు అందజేస్తున్న అతిథులు

బాలుర విభాగంలో విజేతగా కర్నూలు జట్టు

సీనియర్‌ మహిళల విభాగంలో విశాఖపట్నం

కర్నూలు స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): స్థానిక డీఎస్‌ఏ అవుట్‌ డోర్‌ స్టేడియంలో కర్నూలు జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన ఆధ్వర్యం లో గత రెండు రోజులుగా జరుగుతున్న పదో రాష్ట్ర స్థాయి సీనియర్‌ మహిళలు, జూనియర్‌ బాలుర విభాగం పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టు మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో వెస్టు గోదావరి జట్టు, మూడో స్థానంలో సంయుక్త విజేతలుగా కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా జట్లు నిలిచాయి. అలాగే జూనియర్‌ బాలుర విభాగంలో చాంపియనగా కర్నూలు జిల్లా జట్టు నిలవుగా, రెండో స్థానంలో చిత్తూరు జిల్లా జట్టు, మూడో స్థానంలో శ్రీకాకుళం జట్టు నిలిచాయి. నాలుగో స్థానంలో ఈస్ట్‌ గోదావరి జట్టు నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి రుద్రరెడ్డి అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు సర్వీసెస్‌ టీమ్‌ కోచ కాశీం సాహేబ్‌, రాష్ట్ర టెక్నికల్‌ కమిటీ సభ్యులు నాగేంద్ర, విజయకుమార్‌, గోపి, స్కేటింగ్‌ సంఘం కార్యదర్శి సునీల్‌ కుమార్‌, యోగా సంఘం కార్యదర్శి అవినాశ శెట్టి, షూటింగ్‌ బాల్‌ సంఘం జిల్లా కార్యదర్శి ఈశ్వర్‌ నాయుడు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే వివిధ జిల్లాల కోచ మేనేజర్లు, బెస్టు ప్లేయర్‌ మహిళల విభాగంలో వైజాగ్‌ చెందిన తులసి, జూనియర్‌ బాయ్స్‌ విభాగంలో కర్నూలు చెందిన రియాజ్‌ బాషాలు ఎంపికయ్యారు.

Updated Date - Feb 24 , 2025 | 12:45 AM