స్టేడియం.. పూర్తయ్యేదెన్నడు?
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:48 PM
గత టీడీపీ ప్రభుత్వం పట్టణంలోరూ.2కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక విట్టా కిష్టప్ప నగర్‌లో జిల్లా క్రీడా ప్రాధికారక సంస్థ 2017-18లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రం ఇండోర్ స్టేడియం నిర్మాణా నికి 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు.

మొండిగోడలకే పరిమితమైన ఇండోర్ స్టేడియం
2018లో గత టీడీపీ హయాంలో మొదలు
బిల్లులు చెల్లించని వైసీపీ ప్రభుత్వం
ఆదోని అగ్రికల్చర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం పట్టణంలోరూ.2కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక విట్టా కిష్టప్ప నగర్‌లో జిల్లా క్రీడా ప్రాధికారక సంస్థ 2017-18లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రం ఇండోర్ స్టేడియం నిర్మాణా నికి 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు.
ప్రభుత్వం మారడంతో..
22018లో స్టేడియం పనులు వేగంగా సాగాయి. 60 శాతంపైగా పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ రూ.50 లక్షలపైగానే పనులు చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో బిల్లులు చెల్లిం చలేదు, దీంతో పనులు ఆగిపోయాయి. బిల్లులు ఆపేసింది. కాంట్రాక్టర్ చేతులెత్తేసి, పనులను నిలిపివేశారు. సాదన చేసేందుకు స్టేడియం లేక తాము ఇబ్బంది పడుతున్నామని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి, నిధులు మంజూరు చేసి స్టేడియం నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరుతున్నారు.
మొండిగోడలకే పరిమితం
దాదాపు ఐదేళ్ల నుంచి మొండి గోడలకే పరిమి తమైంది. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పడలేదు. దీంతో క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం స్పందించి పనులను ప్రారం భించి పూర్తి చేయాలని క్రీడాకారులు కోరుతు న్నారు. ఈ విషయమై శ్యాప్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
క్రీడాకారులను ప్రోత్సహించాలి
ఆదోని నుంచి ఎందరో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తున్నారు. స్టేడియం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించి పూర్తి చేయాలి. - షబ్బీర్ అహ్మద్, క్రీడాకారుడు
ప్రభుత్వం స్పందించాలి
2018 లో రూ.2కోట్లతో ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభమ య్యాయి. ఇదేళ్లుగా పనులు సాగకపోవడంతో క్రీడాకారులు నిరుత్సాహంతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి పనులు మొదలుపెట్టాలి. - శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు