Share News

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:27 AM

నగరంలోని సంకల్‌బాగ్‌లో వెలసిన హరిహర క్షేత్రంలో శ్రీవారి 19వ వార్షిక బ్రహ్మో త్సవాలు శనివారంతో ముగిశాయి.

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శంఖు, చక్రాలతో స్వామివారిని చక్రస్నానానికి తీసుకెళ్తున్న ఆలయ నిర్వాహకులు

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): నగరంలోని సంకల్‌బాగ్‌లో వెలసిన హరిహర క్షేత్రంలో శ్రీవారి 19వ వార్షిక బ్రహ్మో త్సవాలు శనివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు ఆలయం లోని స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులకు అభి షేకాలు, అర్చనలు, మహా మం గళహారతి, నైవేద్యా సమర్పణ వంటి పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయంలో వసం తోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు చక్రస్నానం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిం చారు. ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను, శంఖు, చక్రములతో స్వామివారి విగ్రహమూర్తితో సమీపంలోని తుంగభద్ర నదిలో చక్రస్నాన ఘట్టాన్ని ప్రారంభిం చారు. వేద పండితుడు కమలసాయినాథ శర్మ, ఆలయ అర్చకులు దేవెళ్ల విజయకుమార్‌ శర్మ, మామిళ్లపల్లి రాజేశశర్మ, దీపక్‌శర్మ, ప్రసన్నకుమార్‌ శర్మలు వందలాది భక్తులు వెంట రాగా, స్వామివారికి చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌, ప్రధాన కార్య దర్శి చల్లా నాగరాజ శర్మ, సముద్రాల శ్రీధర్‌లు స్వామివారి శంఖు, చక్రాలు, ఉత్సవమూర్తిని స్వహస్తాలతో తీసుకువెళ్లి నదీ స్నానం చేయించారు. అనంతరం ఆల యంలో బ్రహ్మోత్సవాల ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించి, ఉత్సవాలు ముగి సినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతి నిధులు సీవీ దుర్గాప్రసాద్‌, శ్యామసుందర్‌రావు, నాగులవరం రాజశేఖర్‌, సీఎస్‌ ప్రసాదరావు, టీవీ రవిచంద్రశర్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:27 AM