Share News

వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:01 AM

నగరంలోని సంకల్‌బాగ్‌లో తుంగభద్ర నదీతీరాన వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న శ్రీవారి 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యా ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నగరంలోని సంకల్‌బాగ్‌లో తుంగభద్ర నదీతీరాన వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న శ్రీవారి 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యా ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో వేదిక ఏర్పాటు చేసి, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. లోక కల్యాణార్థం పంచసూక్త హామం నిర్వహించారు. అనం తరం టీటీడీ వేద పండితుడు, ఘనాపాటి కమలసాయినాథ శర్మ నేతృత్వంలో రాజేశ్‌ శర్మ, విజయకుమార్‌ శర్మ, దీపక్‌శర్మ, ప్రసన్న శర్మ కల్యాణ వేడుకలను నిర్వహించారు. పండితుడు వేణుగోపాల శర్మ శ్రీవారి కల్యాణ వేడుకల విశిష్టతను తెలియజేస్తూ, ప్రవచన బోధన చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ జిల్లా జనరల్‌ మేనేజర్‌ రమేశ్‌, ఏజీఎం శ్రీనివాసనాయక్‌, కరివేన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వేణుగోపాల్‌, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరాజు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు సండేల్‌ చంద్రశేఖర్‌, సీవీ దుర్గాప్రసాద్‌, సభ్యులు చల్లా నాగరాజు శర్మ, శ్యామసుందర రావు, రాజశేఖర్‌ రావు, సీఎస్‌ ప్రసాదరావు, టీవీ రవిచంద్ర శర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహించారు.

నేడు బ్రహ్మోత్సవాల ముగింపు...

హరిహర క్షేత్రంలో పది రోజులుగా కొన సాగుతున్న శ్రీవారి 19వ వార్షిక బ్రహ్మోత్స వాలు శనివారం ముగియను న్నాయి. తుంగభద్ర నదిలో స్వామివారికి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:01 AM