క్రీడలకు ప్రోత్సాహం అందిస్తా: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:01 AM
ఎమ్మిగనూరులో క్రీడలకు, క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహాకాన్ని అందిస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

ఎమ్మిగనూరు టౌన, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరులో క్రీడలకు, క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహాకాన్ని అందిస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని నీలకంరేశ్వర స్వామి రఽథోత్సవం సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్, వాలీబాల్ టోర్నమెంట్లను ఎమ్మెల్యే బీవీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగ నూరు క్రీడలకు పుట్టినిల్లు అని, ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ క్రీడల నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. కార్యక్ర మంలో అర్గనైజర్ రామకృష్ణ, సీజీ ఈరన్న, విజేత నాగరాజు, బందె నవాజ్, ఉరుకుందయ్యశెట్టి, కోచ మాబు, సీఐ శ్రీనివాసులు, ఎస్సై, నాయకులు పాల్గొన్నారు.
క్రికెట్ విజేత బుల్స్ బుల్లెట్: నలబై రోజులుగా బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ స్థానిక వీవర్స్‌కాలనీ మైదానంలో నిర్వహిస్తుండగా బుధవారం ఫైనల్ మ్యాచలో బుల్స్ బుల్లెట్, స్టార్ లెవెన జట్లు పోటీ పడగా టాస్ గెలిచిన బుల్స్‌బుల్లెట్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 12ఓవర్లలో 148 పరుగులు చేయగా స్టార్ లెవెన 110 పరుగులకు అలౌట్ అయింది. బుల్స్‌బుల్లెట్ విజేతగా నిలిచింది. విన్నర్స్‌కు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ట్రోఫీతో పాటు రూ2,00,016 నగదు ప్రదానం చేయగా, రన్నర్స్‌కు రూ 1,00,000 అందజేశారు. కామెంటరీ చేసిన రంజితను ఎమ్మెల్యే మెచ్చుకున్నారు. ఫైనల్ మ్యాచను ఆసక్తిగా ఎమ్మెల్యే, అప్నా బజార్ శేఖర్, టీడీపీ నాయకులు వీక్షించారు. అర్గనైజర్స్ రంగస్వామి గౌడ్, నర్సన్నగౌడ్, బీమేష్, సురేష్ చౌదరిలను అభినందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సీఐ శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు.