శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:51 AM
మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం పురస్కరించుకొని కామేశ్వరీదేవి అమ్మవారికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మహానంది, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం పురస్కరించుకొని కామేశ్వరీదేవి అమ్మవారికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానం ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులతో ఈవో సమావేశం నిర్వహించారు. శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక సేవలు చెసే విధానంపై చర్చించారు. మెదటి శుక్రవారం గాజుల అలంకారం, రెండో శుక్రవారం పసుపు కొమ్ములతో, మూడో శుక్రవారం ఫలాలతో, నాలుగో శుక్రవారం పట్టుచీరలతో కామేశ్వరీదేవి అమ్మవారిని అలంకరించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించ నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ మధు పాల్గొన్నారు.