కోసిగయ్య స్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:46 PM
కార్తీకమాసంలో ఆలయంలో మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు శనివారం కార్తీకమాస పూజలు కట్టి స్వామివారికి పుష్పాలంకరణలో ఆలయ అర్చకులతో పాటు దేవదాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, మేటీ గౌళ్లు, పాలేగార్ దొరల వంశస్థులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.
కోసిగి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసంలో ఆలయంలో మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు శనివారం కార్తీకమాస పూజలు కట్టి స్వామివారికి పుష్పాలంకరణలో ఆలయ అర్చకులతో పాటు దేవదాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, మేటీ గౌళ్లు, పాలేగార్ దొరల వంశస్థులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో భక్తులు ఆలయం మొత్తం కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కోసిగి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు స్వామికి భారీ గజమాలను వేసి పూజలు చేశారు. ఈ ఏడాది ఆలయాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. సాయంత్రం వేళ ఆలయం ముందు యువతీ యువకుల కోలాటాలు అలరించాయి. కార్యక్రమాల్లో ఈవో సాయికుమార్, ఆలయ అర్చకులు విష్ణుచిత్, ప్రసాద్ పాల్గొన్నారు.