Share News

పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:39 AM

ఎస్పీ విక్రాంత పాటిల్‌ గురువారం ఎమ్మిగనూరు పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేశారు.

పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
ఎమ్మిగనూరు రూరల్‌ పోలీస్‌ స్టేషనను తనిఖీ చేస్తున్న ఎస్పీ

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఎస్పీ విక్రాంత పాటిల్‌ గురువారం ఎమ్మిగనూరు పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేశారు. జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ విక్రాంత పాటిల్‌ సాధారణ తనిఖీల్లో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లను వచ్చారు. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మిగ నూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, పట్టణ సీఐ శ్రీనివాసులు, రూరల్‌ సీఐ బీవీ మధుసూదనరావు, పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు డాక్టర్‌ నాయక్‌, కె.శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గోనెగండ్ల: గోనెగండ్లలోని పోలీస్‌స్టేషనను ఎస్పీ విక్రాంత పాటిల్‌ గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషనను పరిశీలించారు. మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి. అందులో ఎన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి.. మండలంలో లాఅండ్‌ ఆర్డర్‌ అందుపులో ఉందా అని సీఐ గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని ఎన్ని గ్రా మాలలో పోలీస్‌ పికెట్‌ ఉందని అడిగారు. అనంతరం పోలీస్‌ స్టేషనకు వచ్చిన మండల ప్రజలతో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఏ పంటలు అధికంగా సాగు చేస్తారు.. గ్రామాలలో పరిస్థితి ఏమిటని అడిగారు.

Updated Date - Feb 07 , 2025 | 12:39 AM