Share News

ప్రజా సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:18 PM

ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించండి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. రీఓపెన్‌ అయిన ప్రజా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ రాజకుమారితోపాటు జేసీ విష్ణుచరణ్‌, డీఆర్వో రామునాయక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 187 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. అర్జీదారుడికి పరిష్కార నివేదికను అందజేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. జిల్లాలో 7,644 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటన్నింటినీ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ విష్ణుచరణ్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులతోపాటు రెవెన్యూ సదస్సులు, రీ సర్వేకు సంబంధించిన దరఖాస్తులు కూడా అధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటన్నింటిపై ప్రత్యేకదృష్టి సారించి పరిష్కరించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు.

Updated Date - Feb 17 , 2025 | 11:18 PM