బాలికల విద్యతోనే సాంఘిక దురాచారాలు దూరం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:30 PM
బాలికల విద్యతోనే సమాజంలో ఉన్న దురాచారాలు, బాల్య వివాహలు దూరమవుతాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం
గోనెగండ్ల, జనవరి 18(ఆంధ్రజ్యోతి): బాలికల విద్యతోనే సమాజంలో ఉన్న దురాచారాలు, బాల్య వివాహలు దూరమవుతాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం అన్నారు. శనివారం గోనెగండ్లలోని ఎంపీడీవో సమావేశ భవనంలో అంగన్‌వాడీ, వెలుగు, ఏఎన్‌ఎం, వెలే ్ఫర్ అసిస్టెంట్ సిబ్బందితో కిషోర్ బాలికల వికాస శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణా ప్రాంతాలలో 12 ఏళ్లకే బాలికలకు వివాహం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దురాచారాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వలసలు వెళ్లే కుటుంబాలు తమ వెంటనే తమ పిల్లలను తీసుకుపోవడం వల్ల విద్యపై ఆసక్తి తగ్గిపోతోందని తెలిపారు. ప్రభుత్వం కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, వాటిపై కూలీలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు సోషల్ మీడియా, సెల్ ఫోన్ వాడకం వల్ల పిల్లలు చెడిపోతున్నారని, తల్లిదండ్రులు వాటికి తమ పిల్లలను దూరంగా ఉంచేవిధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా లీగల్ కమ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీలక్ష్మి పోక్సో చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్ట్ అధికారి శారద, సీఐ గంగాధర్, ఎంపీడీవో మణిమంజరి, ఏపీఎం హేమలత, మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.