Share News

స్వల్పంగా పెరిగిన వేరుశనగ ధర

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:09 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వేరుశనగ ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం వేరుశనగ ధర గరిష్టంగా క్వింటాలు రూ. 6,989 పలికింది.

స్వల్పంగా పెరిగిన వేరుశనగ ధర
విక్రయానికి వచ్చిన వేరుశనగ

క్వింటం రూ. 6989

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వేరుశనగ ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం వేరుశనగ ధర గరిష్టంగా క్వింటాలు రూ. 6,989 పలికింది. గతవారంతో పోల్చితే క్వింటానికి రూ. 300పైగా ధర పెరిగింది. బోరు బావులు కింద సాగైనా వేరుశనగ పంట కోతలు మొదలు కావడంతో రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు. స్వల్పంగా ధర పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు రూ.8 వేలుకు పైగా ధర పలికితే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. 7582 వేరుశనగ బస్తాలను రైతుల విక్రయానికి తీసుకురాగా వాటి కనిష్ఠ ధర రూ. 3,096, గరిష్ఠ ధర రూ. 6,989, మధ్యస్థ ధర రూ.6389 పలికింది.

Updated Date - Feb 26 , 2025 | 12:09 AM