Share News

కోసిగయ్య స్వామికి వెండి పాదుకలు బహూకరణ

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:44 PM

కోసిగిలో వెలిసిన కోసిగయ్యస్వామి (ఆంజనేయస్వామి)కి కోసిగికి చెందిన భక్తులు శనివారం దేవదాయ శాఖ ఈవో సాయి కుమార్‌, ఆలయ అర్చకుడు విష్ణుచిత్‌కు వెండి పాదుకలను అంద జేశారు.

 కోసిగయ్య స్వామికి వెండి పాదుకలు బహూకరణ
ఈవో సాయికుమార్‌ వెండి పాదుకలను అందజేస్తున్న భక్తుడు

కోసిగి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కోసిగిలో వెలిసిన కోసిగయ్యస్వామి (ఆంజనేయస్వామి)కి కోసిగికి చెందిన భక్తులు శనివారం దేవదాయ శాఖ ఈవో సాయి కుమార్‌, ఆలయ అర్చకుడు విష్ణుచిత్‌కు వెండి పాదుకలను అంద జేశారు. గడ్డం నవీన్‌ కుమార్‌, గడ్డం నేలకల్లు వీరన్న రూ.95వేలు విలువ చేసే 594.800 గ్రాముల వెండి పాదుకలను అందించారని తెలిపారు. భక్తులకు మంత్రోచ్చరణాల మధ్య ఫలపుష్ప మంత్రాక్షితలు అందజేశారు. స్వామికి భక్తులు విరివిగా విరాళాలు అందజేసి రసీదు పొందాలని ఈవో సూచించారు.

Updated Date - Nov 22 , 2025 | 11:44 PM