శ్రీశైలంలో వెండి రథోత్సవం
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:39 PM
శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆలయ వేదపండితులచే నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆలయ వేదపండితులచే నిర్వహించారు. సోమవారం సప్తమి తిధి సందర్భంగా స్వామి అమ్మవార్లకు మేళతాళాలతో వెండిరథోత్సవం ఆలయ మాడవీధుల్లో నిర్వహించారు. అనంతరం సహస్ర దీపార్చన కార్యక్రమం నిర్వహించారు. దేవస్ధాన సేవగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల లక్ష్మీ బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రాచీన కళల పరిరక్షణలో భాగంగా నిత్యకళారాథన కార్యక్రమంలో హరికథ, బుర్రకథ, సంప్రదాయనృత్యం, వాయుద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో శ్రీనివాసరావు, వేదపండితులు, దేవస్ధానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.