ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:13 AM
నగరంలో మహా శివరాత్రి ఉత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి.
జగన్నాథగట్టుపై కన్నుల పండువగా రథోత్సవం
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): నగరంలో మహా శివరాత్రి ఉత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి. గురువారం వివిధ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల కల్యాణం, పల్లకీలలో ఊరే గింపు, శోభాయాత్రలు, రథోత్సవాలను నిర్వహించారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై వెలసిన ఉమా సహిత రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక దిన్నెదేవరపాడుతోపాటూ నగరం చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాలకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
హరిహర క్షేత్రంలో.. హరిహర క్షేత్రంలోని భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి మహా రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసన్న, కె. మహేశశర్మ, గురురాజారా వుల ఆధ్వర్యంలో పూజలు చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పల్లకీ సేవ చేపట్టారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో నగర బాహ్మణ సంఘం అధ్యక్ష, కార్యద ర్శులు సండేల్ చంద్రశేఖర్, చల్లా నాగరాజ శర్మ, గౌరవాధ్యక్షుడు సీవీ దుర్గాప్రసాద్, కంచుగంటల శ్యామసుందర రావు, మామిళ్లపల్లి రాజేశ శర్మ, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్రశర్మ, కోశాధి కారి సీఎస్ ప్రసాద రావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్‌రావు, సభ్యులు ఎస్. శ్రీనివా సరాజు, ఆనందరావు, ఆలయ మేనేజర్ రాధాకృష్ణ, శివన్న పాల్గొన్నారు.
వైభవంగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం
గూడూరు: గూడూరులో భువనేశ్వరి నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అశేష భక్త జనుల మధ్య రథాన్ని ఆలయం నుంచి అంజనేయస్వామి అలయం వరకు లాగారు. ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కమనీయం.. స్వామి, అమ్మవార్ల కల్యాణం
కల్లూరు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరు ఈశ్వర వీరభద్ర, భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యా ణం కమనీయంగా సాగింది. గురువారం తెల్లవారు జామున జరిగిన స్వామి, అమ్మవార్ల కల్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనం తరం స్వామి, అమ్మవార్లను గ్రామ వీధుల గుండా ఊరేగించి పల్లకీసేవ, నందికోలా సేవ కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గురెడ్డి, చంద్ర శేఖరప్ప, నవీనకుమార్, శంకరప్ప, వీరన్న, మహేంద్ర, పద్మనాభం, రాఘవేంద్ర, శేషసాయి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.