Share News

జనసేన వైపు శిల్పా చూపు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:17 PM

శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన వైపు చూస్తున్నారని, ఆ పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆరోపించారు.

జనసేన వైపు శిల్పా చూపు
సమావేశంలో మాట్లాడుతున్న భూమా అఖిలప్రియ

కేసీని పూడ్చేసి నీరు లేకుండా చేసిన ఘనుడు

శిల్పా చక్రపాణిపై ఎమ్మెల్యే అఖిల ప్రియ ఫైర్‌

నంద్యాల మున్సిపాలిటీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన వైపు చూస్తున్నారని, ఆ పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆరోపించారు. సోమవారం తెలుగు గంగ కార్యాలయంలో భూమా అఖిల ప్రియ.. తెలుగు గంగ సాగు నీటి సంఘ ఛైర్మన్‌ సంజీవ కుమార్‌ రెడ్డి అధ్యక్షత సభ్యులతో పాటు అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆమె మాట్లాడారు. అధికారం లేకపోతే తమ పనులు సాగవని తెలుసుకున్న శిల్పా చక్రప్రాణి రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. కేసీ కెనాల్‌ను ఆక్రమించుకుని 7వేల ఎకరాలకు నీరందకుండా చేసిన ఘనుడని ఆరోపించారు. శిల్పా వెంచర్‌లో ఓ బాలిక మానగభంగానికి గురై హత్యకు గురైతే సాక్ష్యాలు లేకుండా బాలిక మృతదేహాన్ని కాల్చివేశాడని దుయ్యబట్టారు. శిల్పా డ్రైవర్‌ ఒకరు లింగాపురం గ్రామంలో మైనారిటీ మహిళను రేప్‌ చేసి వేధిస్తే శిల్పా కేసును నీరుగార్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే చాలు వైసీపి నాయకులు రాష్ట్రం వీడాల్సి వస్తుందన్నారు. కానీ మాకు కక్ష సాఽధింపు చర్యల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం అని స్పష్టం చేశారు.

అక్రమాలను వెలికి తీయండి : కేసీ కెనాల్‌తో పాటు తెలుగు గంగ కాలువ ప్రాంతాల్లో జరిగిన అక్రమాలను సాగునీటి సంఘాల నాయకులు వెలికితీయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కోరారు. తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల ఆళ్లగడ్డ ప్రాంతం బాగుపడిందన్నారు. ఇదంతా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌, సీఎం చంద్రబాబు పుణ్యమే అన్నారు. గోవిందపల్లె పొలాలకు నీరందటం లేదంటూ తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు, చివరి రైతుకు సైతం నీరందేలా కృషి చేయటమే తన ధ్యేయమన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:17 PM