Share News

షీ బాక్స్‌ ఏర్పాటు

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:35 AM

షీ బాక్స్‌ ఏర్పాటు

షీ బాక్స్‌ ఏర్పాటు
షీబాక్స్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో షీబాక్స్‌ను కలెక్టర్‌ రంజిత్‌ బాషా ప్రారంభించారు. ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో షీబాక్స్‌ను ఏర్పాటు చేశారు. సమస్యలను బహిరంగంగా చెప్పుకోలేని మహిళా ఉద్యోగులు ఈ షీబాక్స్‌లో వినతులు పోస్ట్‌ చేయవచ్చని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు కేవై.కృష్ణ మహిళా విభాగం చైర్‌పర్సన్‌ సాహేరా బాను తదితరులు పాల్గొన్నారు.

- కర్నూలు కలెక్టరేట్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 08 , 2025 | 12:35 AM