Share News

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:02 AM

మండలంలోని ఉరుకుంద ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం హరిప్రసాద్‌ తెలిపారు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

కౌతాళం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉరుకుంద ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం హరిప్రసాద్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల అండర్‌-14, 17 సాప్ట్‌, బేస్‌బాల్‌ పోటీలు నంద్యాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో తమ పాఠశాలకు చెందిన 10వ తరగతి చదువుతున్న కావలి సూరి, శిరీష అండర్‌ 17 విభాగంలో అండర్‌ 14 విభాగంలో సాఫ్ట్‌ బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే అండర్‌-17 విభాగంలో బేస్‌బాల్‌లో రామకృష్ణ, గీతలు, అండర్‌ -14 విభాగంలో వీరేంద్ర ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. పీడీ వరలక్ష్మి, పీఈటీ రమేశ్‌ను, ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Nov 20 , 2025 | 01:02 AM