రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:20 AM
చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి బి.వెంకటయశ్వంత్‌రెడ్డి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం వీపీ శ్రీనివాసులు తెలిపారు.
నంద్యాల హాస్పిటల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి బి.వెంకటయశ్వంత్‌రెడ్డి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం వీపీ శ్రీనివాసులు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి ఈ నెల 18, 19తేదీల్లో తిరుపతిలో జరిగిన జోనల్‌స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభకనబరచి సిల్వర్‌మెడల్ సాధించాడన్నారు. గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియ్‌షిప్‌లో విద్యార్థి పాల్గొనన్నుట్లు తెలిపారు. విద్యార్థిని, ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.