Share News

సచివాలయం.. బహు దూరం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:09 AM

: హంపా, కొత్తపల్లి, బొమ్మనపల్లి, ఎడవల్లి గ్రామాలకు ఒకే సచివాలయం ఉంది. కాగా కొత్తపల్లి బొమ్మనపల్లి గ్రామానికి మజరా గ్రామం. నాలుగు గ్రామాలకు ఒకే సచివాలయం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు.

సచివాలయం.. బహు దూరం
పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ప్రారంభానికి నోచుకోని నూతన భవనం

మద్దికెర మండలంలోని హంప, కొత్తపల్లి, బొమ్మనపల్లి, ఎడవల్ల గ్రామాలకు ఒకే సచివాలయం

అవస్థలు పడుతున్న గ్రామస్థులు

మద్దికెర, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): హంపా, కొత్తపల్లి, బొమ్మనపల్లి, ఎడవల్లి గ్రామాలకు ఒకే సచివాలయం ఉంది. కాగా కొత్తపల్లి బొమ్మనపల్లి గ్రామానికి మజరా గ్రామం. నాలుగు గ్రామాలకు ఒకే సచివాలయం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. ప్రభుత్వ పథకాలు అందాలన్నా... జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఏదీ కావాలన్నా సచివాలయాల ద్వారానే తీసుకోవాల్సి ఉంది.

కిలోమీటర్లు వెళ్లాల్సిందే..

ప్రజలకు ఇంటి వద్దే, సమీపంలోనే ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశ్యంతోనే గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టింది. అయితే మద్దికెర మండలంలోని ఈ నాలుగు గ్రామాలకు సచివాలయ సేవలు అంత సుళువుగా అందడం లేదు.

నూతన భవనం ప్రారంభమెప్పుడు?

హంప గ్రామంలో సచివాలయాన్ని పంచాయతీ భవనంలోని ఇరుకు గదిలో ఏర్పాటు చేశారు. గ్రామ శివార్లలో రెండేళ్ల క్రితమే సచివాలయం కోసం నూతన భవనాన్ని నిర్మించారు. అయితే దీన్ని ఎవరూ ప్రారం భిచండం లేదు. రాజకీయ కారణాలతోనే ప్రారంభించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వృద్ధులు, మహిళల అవస్థలు

హంపా గ్రామంలో సచివాల యం ఉంటంతో కొత్తపల్లి, బొమ్మనపల్లి, ఎడవల్లి గ్రామాల ప్రజలు దాదాపు 7-8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఆటోలు అందుబాటులో లేకపోవడతో ద్విచ క్రవాహనాల్లో వెళ్లాలి. అవి లేకుంటే ఇక నడవా ల్సిందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎడవలి, కొత్తపల్లి, బొమ్మనపల్లి గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బంది

హంపా గ్రామం లోని సచివాలయా నికి వెళ్లేందుకు రోడ్డు, బస్సు సౌకర్యాలు లేవు. ఆటోల్లో వెళ్లాలంటే అధికంగా డబ్బు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం బొమ్మనపల్లి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి. - రంగస్వామి, కొత్తపల్లి

పనులు పూర్తికాగానే ప్రారంభిస్తాం

మండలంలోని హంప గ్రామంలో నూతన సచివాలయ భవనం నిర్మించాం. అయితే భవనంలో విద్యుత్‌, బాత్‌రూమ్‌ పనులు పెండింగ్‌ ఉన్నాయి. వాటిని కూడా పూర్తిచేసి త్వరలో సచివాలయాన్ని ప్రారంభిస్తాం. - కొండయ్య, ఎంపీడీవో, మద్దికెర

Updated Date - Jan 12 , 2025 | 12:09 AM