పాఠశాల తనిఖీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:50 AM
మండలంలోని తొగర్చేడు ఎంపీయూపీ పాఠశాలను డీఈవో జనార్దన్ రెడ్డి మంగళవారం వార్షిక తనిఖీ నిర్వహించారు.

పాణ్యం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తొగర్చేడు ఎంపీయూపీ పాఠశాలను డీఈవో జనార్దన్ రెడ్డి మంగళవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు చేసిన కృత్యాలను, అబాకస్ పరికరాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైన రీతిలో టీఎల్ ఎం ద్వారా బోధన చేయాలన్నారు. వెనుక బడిన విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో కోటయ్య, సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎం సాంబశివుడు, అరుణ్‌కుమార్ నాయక్, యూనస్ బాషా, మాధవరెడ్డి, ప్రకాష్‌రావు పాల్గొన్నారు.