Share News

ఎస్సీ వర్గీకరణ సరికాదు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:16 AM

ఎస్సీ వర్గీకరణ సరికాదని మాల సంఘాల నాయకులు అన్నారు. కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన మహాసభ మాలల జేఏసీ కన్వీనర్‌ యాట ఓబులేసు అధ్యక్షతన నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణ సరికాదు
సభలో అభివాదం చేస్తున్న మాల సంఘాల నాయకులు

మాలల యుద్ధ గర్జన మహాసభలో నాయకులు

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ సరికాదని మాల సంఘాల నాయకులు అన్నారు. కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన మహాసభ మాలల జేఏసీ కన్వీనర్‌ యాట ఓబులేసు అధ్యక్షతన నిర్వహించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కుట్ర వల్ల ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిందని అన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ వర్గీకరణ వల్ల మాల కులస్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. గ్రామ స్థాయిలో వర్గీకరణకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు.మాలల శక్తిగా తయారు కావాలని, అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఉద్యమం ఉధృతం దాలుస్తుందన్నారు. సభలో ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌, విశ్రాంత అధికారి పీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:16 AM