Share News

ప్రజాసేవతోనే సంతృప్తి

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:14 AM

ప్రజా సేవతోనే సంతృప్తి కలుగుతుందని బనగానపల్లె మాజీ సర్పంచ్‌ బీసీ రాజారెడ్డి అన్నారు.

ప్రజాసేవతోనే సంతృప్తి
మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న బీసీ రాజారెడ్డి

రూ.28 లక్షలతో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన బీసీ రాజారెడ్డి

మహానంది, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రజా సేవతోనే సంతృప్తి కలుగుతుందని బనగానపల్లె మాజీ సర్పంచ్‌ బీసీ రాజారెడ్డి అన్నారు. తన తల్లిదండ్రులు బీసీ లక్ష్మమ్మ, బీసీ గుర్రెడ్డి జ్ఞాపకార్థం సొంత నిధులు రూ.28లక్షలు వెచ్చించి నంద్యాల- అమరావతి జాతీయ ప్రధాన రహదారిలోని గాజులపల్లె సమీపంలో ఉచిత కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఆదివారం ప్రారంభించారు. నేషనల్‌ హైవే 544లో నల్లమల కొండ అంచున ప్రజలకు ఉచితంగా మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా భోజన వసతి కల్పించారు. రాజారెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులు, వాహనదారులు సర్వనరసింహస్వామి ఆలయానికివెళ్లే భక్తుల దాహం తీర్చడానికి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిద్దలూరు, కంభం, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు, ప్రయాణికులకు దార్తి తీర్చాలన్న ఆలోచనలతో వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. అర ఎకరం కొనుగోలు చేసి విద్యుత్‌ సౌకర్యం లేకపోయినా సొంత నిధులతో విద్యుత్‌ సంతంభాలు ఏర్పాటు చేసి విద్యుత్‌లైన్‌లను లాగించామని చెప్పారు. ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు, వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు సమీపంలోని సర్వలక్ష్మినరసింహస్వామి భక్తులకు కూడా తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. 11 ఏళ్ల క్రితం బనగానపల్లె - కర్నూలు రహదారిలో బేతంచెర్ల మండలం గోర్లగుట్ట సమీపంలో ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసి నేటికీ ప్రయాణికులు, వాహనదారుల దాహర్తిని తీరుస్తున్నట్లు తెలిపారు. అలాగే 10ఏళ్ల క్రితం బేతంచెర్ల మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ మద్దిలేటిస్వామి క్షేత్రంలో భక్తులకోసం మినరల్‌వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాజులపల్లె గ్రామ సమీపంలో వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసిన బీసీ రాజారెడ్డిని గ్రామస్థులు శాలువా కప్పి గజమాలలతో సత్కరించారు.

Updated Date - Feb 24 , 2025 | 12:14 AM