ఘనంగా సరోజిని నాయుడు జయంతి
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:25 AM
స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు సరోజిని నాయుడు 146వ జయంతిని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.

కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు సరోజిని నాయుడు 146వ జయంతిని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.ప్రకాశ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేజీ గంగాధరరెడ్డి హాజరై సరోజిని నాయుడు చేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథాలయ అధికారి వి.పెద్దక్క, లైబ్రేరియన్లు బాషా, వజ్రాల గోవిందరెడ్డి పాల్గొన్నారు.