జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:07 AM
నంద్యాల జగజ్జననీ అమ్మవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయాన్నే పంచామృతా భిషేకాలు, సుగంధధ్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు.
నంద్యాల కల్చరల్, జూలై 3(ఆంధ్రజ్యోతి): నంద్యాల జగజ్జననీ అమ్మవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయాన్నే పంచామృతా భిషేకాలు, సుగంధధ్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి కడప, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, బళ్లారి, కర్నూలు, గిద్దలూరు, ఎమ్మిగనూరు, తొగర్చేడు, చాపిరేవులు తదితర ప్రాంతాల నుంచి మహిళాభక్తులు అమ్మవారికి పుట్టింటి చీర, సారె తీసుకొచ్చి సమర్పించారు. దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.