ఆర్టీ‘ఛీ’ అధికారులు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:20 AM
ప్రయాణికులకు మెరగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గురువారం ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

కర్నూలుకు బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు
నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన డిపో మేనేజర్
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు మెరగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గురువారం ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆదోని నుంచి కర్నూలుకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7:00 వరకు ప్రయాణికులు పడిగాపులు కాశారు. బసుసలు వేయాలని డిపో మేనేజర్‌కు పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డీఎం మహమ్మద్ రఫీను వివరణ కోరగా బస్సులు ఉన్నాయని, లేరని ఎవరు చెప్పారంటూ చిందులు వేశారు.