Share News

తాగునీటి పథకాలకు రూ.16.5 లక్షలు మంజూరు: డీఈ

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:34 AM

మండలంలోని గిరిజన గూడెల్లో శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం రూ.16.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు నందికొట్కూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తాగునీటి పథకాలకు రూ.16.5 లక్షలు మంజూరు: డీఈ
జానాలగూడెంలో పైపులైన్‌ కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కొత్తపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన గూడెల్లో శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం రూ.16.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు నందికొట్కూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కొత్తపల్లి మండల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ జుబేర్‌, సర్పంచ్‌ బాల ఎల్లయ్యతో కలిసి మండలంలోని సంగమేశ్వరం, జానాలగూడెం, బలపాలతిప్ప, సిద్దేశ్వరం గ్రామాల్లో తాగునీటి పథకాల కోసం స్థలాలను పరిశీలించారు. పది రోజుల్లో పనులు ప్రారంభించి ఈ గ్రామాలకు శుద్ధ జలాలు అందించనున్నట్లు డీఈ తెలిపారు. డీఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంగమేశ్వరంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద రూ.3 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో భక్తులకు రెండు మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కోసం ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జానాల గూడెంలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.6 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ గూడెంలో పైపులైన్‌ నిర్మాణంతో పాటు 40 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే బలపాలతిప్పలో కూడా రూ.4.50 లక్షల నిధులు కూడా మంజూరు కాగా, అక్కడ కూడా పైపుల నిర్మాణం 40 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సిద్దేశ్వరం కూడా రూ.3 లక్షల నిధులు మంజూరు కాగా, అక్కడ కూడా పైపులైన్‌ నిర్మాణం, ఇంటింటికి కొళాయి కనెక్షన్లు కూడా ఇవ్వన్నుట్లు వెల్లడించారు.

Updated Date - Jul 24 , 2025 | 12:34 AM