ఆర్‌ఐ లేక అవస్థలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:51 PM
తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టు ఖాలీగా ఉంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్‌ఐ సుధాకర్ రెడ్డిని మూడు నెలల క్రితం సాధారణ బదిలీల్లో ఆలూరు కు బదిలే చేశారు.

తుగ్గలి మండలంలో ఆర్‌ఐ పోస్టు ఖాళీ
పనులు అవక అవస్థలు పడుతున్న ప్రజలు
ఉన్నతాధికారులకు నివేదించాం : తహసీల్దార్
తుగ్గలి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టు ఖాలీగా ఉంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్‌ఐ సుధాకర్ రెడ్డిని మూడు నెలల క్రితం సాధారణ బదిలీల్లో ఆలూరు కు బదిలే చేశారు. అయితే ఆయన స్థానంలో మరోకరిని నియమించ లేదు. మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉండగా, దాదాపు 50వేల మంది నివసిస్తున్నారు. అలాగే 25వేల హెక్టార్లకు పైగా సాగు భూములు ఉన్నాయి. భూసమస్యలు, పొలం తగాదాలు, సర్వే తదితర వాటికి ఆర్‌ఐ పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా
భూ సమస్యల పరిష్కారానికి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఆర్‌ఐ లేకపోవ డంతో సమస్య పరిష్కారం కావడం లేదు. మా గ్రామం ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం ఉంది. అలాగే కులం, ఆదాయ ధ్రువీకరణకు కూడా ఇబ్బంది పడుతున్నాం. - రాజు నాయక్, వైజీ తండా
ఉన్నతాధికారులకు నివేదించాం
రవికుమార్ నాయక్‌ను తుగ్గలికి నియమించా రు. అయితే ఆయన డిప్యూటేష న్‌పై కర్నూలు కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికా రులకు నివేదించాం. ప్రజలకు సమస్య రాకుండా చూస్తాం. - రమాదేవి, తహసీల్దార్