Share News

రూ.50 కోట్లతో రింగ్‌ రోడ్డు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:23 AM

ఎన్నో ఏళ్లుగా బనగానపల్లె ప్రజలు ఎదురుచూస్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

రూ.50 కోట్లతో రింగ్‌ రోడ్డు
పాణ్యం రహదారిలో రింగ్‌ రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న మంత్రి బీసీ

బనగానపల్లె ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తాం

పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగానపల్లె, జనవరి 6, (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా బనగానపల్లె ప్రజలు ఎదురుచూస్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రింగ్‌ రోడ్డు నిర్మాణం ఉనికిలేకుండా చేశారన్నారు. కనుమరుగైన రింగ్‌ రోడ్డు పనులను సీఎం చంద్రబాబునాయుడు ఆశీస్సులతో తిరిగి పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అధికారుల సహకారంతో ఏడాదిన్నర కాలంలో రింగ్‌ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు కానుకగా అందిస్తామన్నారు. బనగానపల్లె రింగ్‌ రోడ్డును 14.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్లు తెలిపారు. నేషనల్‌ హైవే అథారిటీ పరిధిలో 4.5 కిలోమీటర్లు, ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 11 కిలో మీటర్ల మేర నిర్మాణం పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకణ పనులు పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రాన్ని గుంతల రహిత రహదారులే లక్ష్యం గా రూ.861 కోట్లతో చేపట్టిన రోడ్లను గుంతలు పూడ్చే మరమత్తు పనులు సగం పూర్తయ్యాయన్నారు. జనవరి చివరికి మరమతు పనులు పూర్తి చేస్తామని బీసీ తెలిపారు. త్వరలో పీపీపీ విధానంలో 3వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ నయీముల్లా, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ సునీల్‌రెడ్డి, ఏఈ హుసేన్‌, టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, గాలిమద్దిలేటిరెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, ఉగ్రసేనారెడ్డి, సర్పంచులు తులసిరెడ్డి, మహేశ్వర రెడ్డి రామకృష్ణాపురంశంకర్‌, లక్ష్మికాంతరెడ్డి, బత్తుల భాస్కర్‌రెడ్డి, తిరుమ లయ్య, కలాం, నియాజ్‌, కృష్ణానాయక్‌, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:23 AM