రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: సబ్‌కలెక్టర్
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:01 AM
రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ ఆదేశించారు.

ఎమ్మిగనూరు రూరల్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కడిమెట్ల మజరా గ్రామమైన సిరాలదొడ్డి గ్రామం లో జరుగుతున్న రీ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కడిమెట్ల గ్రామంలో మొత్తం ఎంత భూ విస్తీర్ణం ఉంది, ప్రధాన సమస్యలు ఏవైనా ఉన్నాయా అని తహసీల్దార్ శేషఫణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట మండల సర్వేయర్ వాహిద్, ఆర్‌ఎస్ డీటీ జ్యోతిర్మయి, సర్వేయర్ సురే్‌ష్, రైతులు పాల్గొన్నారు.