సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:21 AM
పోలీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తానని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా తెలిపారు.

ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నంద్యాల క్రైం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పోలీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తానని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ పాల్గొని సిబ్బంది నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పదిమంది సిబ్బంది మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీలపై విన్నవించుకున్నారు. సిబ్బంది సమస్యలను విని పరిశీలించి తగిన పరిష్కారం చూపుతానన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇస్తానన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది సతమతమవకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.