‘వెంటనే మరమ్మతులు చేపట్టాలి’
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:41 AM
జలకనూరు మద్దిగుండం చెరువుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు.
మిడ్తూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జలకనూరు మద్దిగుండం చెరువుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జలకనూరు గ్రామం వద్ద ఉన్న మద్దిగుండం చెరువుకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం చేసిన నీరు చెట్టు పనులు ఇష్టానుసారంగా నాణ్యత లేకుండా చేయడం వల్లే మద్దిగుండం చెరువుకు గండి పడిందని ఆరోపించారు. చెరువుకు గండిపడి మూడు రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎందుకు పూడ్చడంలేదని, ఇక్కడ ఉన్న స్థానిక నేతలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మద్దిగుండం చెరువు పనులను త్వరితగతిన పూర్తి చేయకపోతే రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు.