Share News

రైతుల నుంచి పరిహార పత్రాలు స్వీకరణ

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:44 AM

నేషనల్‌ హైవే 340సి నిర్మాణంలో భాగంగా అదనపు భూ సేకరణ నిమిత్తం పాములపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో రైతుల నుంచి ఆర్డీవో నాగజ్యోతి క్లెయిమ్ డాక్యుమెంట్స్ స్వీకరించారు.

రైతుల నుంచి పరిహార పత్రాలు స్వీకరణ
పరిహార పత్రాలను పరిశీలిస్తున్న ఆర్డీవో నాగజ్యోతి

పాములపాడు, జూలై 2(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ హైవే 340సి నిర్మాణంలో భాగంగా అదనపు భూ సేకరణ నిమిత్తం పాములపాడు తహసీల్దార్‌ కార్యలయంలో రైతుల నుంచి ఆర్డీవో నాగజ్యోతి క్లెయిమ్స్‌ స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని జూటూరు గ్రామం వద్ద జరుగుతున్న హైవే పనులకు 3.805 ఎకరాల భూ సేకరణ కావాల్సి ఉందన్నారు. ఇందుకు గానూ ఈ భూమికి సంబంధించిన 38 మంది రైతులకు అవార్డు కాపీలను అందించామని చెప్పారు. వీరంతా తమ భూములకు సంబంధించి ఆధార్‌ తదితర 11 పత్రాలను పత్రాలను అందించినట్లు తెలిపారు. అలాగే జూపాడుబంగ్లా మండలంలో 1.07 ఎకరాలు భూ సేకరణ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుభధ్రమ్మ, సర్వేయర్‌ విజయ్‌భాస్కర్‌, ఆర్‌ఐ, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:49 AM