వేదవతికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:36 AM
వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు మద్దిలేటి శెట్టి డిమాండ్ చేశారు.

ఆలూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు మద్దిలేటి శెట్టి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కార్యదర్శి రామాంజినేయులు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ గోవిండ్ సింగ్‌కు వినతి పత్రం అందించారు. ఎత్తిపోతల పథకాన్ని 8.5 టీఎంసీల సామర్థ్యతో నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నా రు. పాలకులు మారుతున్నా ఈ ప్రాజెక్టు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతు సంఘం కార్యదర్శి సిద్దలింగ, పెద్దహోత్తూరు గ్రామ కార్యదర్శి రాముడు, సుభాని, ఉల్లిగప్ప, రామాంజి, మళ్లీ, రాముడు పాల్గొన్నారు.