Share News

ఆది దంపతులకు వెండి రథోత్సవం

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:45 AM

శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

 ఆది దంపతులకు వెండి రథోత్సవం
వెండి రథోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులుజేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా సోమవారం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసమూర్తిచే శివతత్త్వంపైప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - Apr 22 , 2025 | 12:45 AM