ప్రణాళికాబద్ధంగా క్యూలైన్లు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:38 PM
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కు ఇబ్బంది తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం(ఆత్మకూరు), జనవరి 25(ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కు ఇబ్బంది తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం టికెట్ల కౌంటర్లను మరో చోటికి మార్చి భక్తు లు వెళ్లే క్యూలైన్లకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.