ఓటరు తుది జాబితా ప్రచురణ
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:33 AM
కర్నూలు నియోజ కవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రచు రించారు.

కర్నూలు న్యూసిటీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కర్నూలు నియోజ కవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రచు రించారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో అధికారులతో కలిసి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కమిషనర్ రవీంద్రబాబు ఓటర్ల జాబితాను ప్రచురించి, రాజకీయపార్టీల ప్రతి నిధులకు ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఓ మాట్లాడుతూ నియోజకవర్గంలో 258 పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధిత బీఎల్‌ఓలు తమ బూత ఓటర్ల జాబితాను ప్రచురించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశామ న్నారు. కొంతకాలం క్రితం నిర్వహించిన స్పెషల్ సమ్మర్ రివిజనలో భా గంగా కొత్త ఓటు నమోదు, తొలగింపు ప్రక్రియ అనంతరం నియో జకవర్గంలో 2,74,553 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్ర మంలో డిప్యూటీ తహసీల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న, ఆర్‌ఐ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.