నాణ్యమైన ఆహారం అందించాలి
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:18 AM
నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మెన్ చిత్త విజయప్రతాప్‌రెడ్డి ఆదేశించారు.

సున్నిపెంట, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మెన్ చిత్త విజయప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సున్నిపెంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠ శాలలు, పౌరసరఫరాల గోదాములను తనిఖీ చేశారు. గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీలకు కాంట్రాక్టర్లు సరఫరా చేసే సరుకులలో నాణ్యత లేదని, ధరల్లో కూడా వ్యత్యాసం ఉందని అన్నారు. సున్నిపెంటలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో మెనూ ప్రకారం ఆహారం అందిచడం లేదని విద్యార్థులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన వార్డన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గిరిజన పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డన్లపై చర్యలకు ఆదేశించినట్లు కమిషన్ చైర్మన్ తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తునట్లు చైర్మెన్ తెలిపారు. రెండు నెలల్లో మళ్లీ వస్తానని, అప్పటిలోపు మార్పు రాకుంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 9966090123 నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తానని ఫుడ్ కమిషన్ చైర్మన్ తెలిపారు.