ఉపాధి పనులు కల్పించండి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:45 PM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజూ వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ రాజకుమారి క్షేత్రస్ధాయి అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ రాజకుమారి
లేబర్ మొబలైజేషన్‌పై శ్రద్ధ పెట్టండి
నంద్యాల కల్చరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజూ వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ రాజకుమారి క్షేత్రస్ధాయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన ్ఫరెన్స్ హాల్ నుండి ఉపాధి హామీ పఽథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, సచివాలయ సర్వీసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్లవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పఽథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబలైజేషన్‌కు ఇంకా 16.5 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉందని అన్నారు. ప్రతిరోజు ప్రతి గ్రామపంచాయతీలో వందమంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీఓ, ఏపీడీ, ఎంపీడీఓలను ఆదేశించారు. మంజూరు చేసిన 850 గోకులం షెడ్ల నిర్మాణాలకు గాను 276 మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన పశువుల షెడ్లను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదే శించారు. గ్రామీణ, పట్టణ ఇళ్ల నిర్మాణం కింద ఇటీవల నిర్దేశించిన 4,772 గృహ నిర్మాణాల లక్ష్యాన్ని మార్చి 31వతేదీలోగా పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హౌసింగ్ డీఈ, ఏఈలను కలెక్టర్ ఆదే శించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ జనార్దన్‌రావు, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, పశుసంవర్థక అధికారి గోవిందనాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.